రాజ్యాంగం యొక్క రక్షణ బీఎల్ పీ లక్ష్యం 

– బీఎల్ పీ పార్టీ మహబూబాద్ పార్లమెంటు అభ్యర్థి కోనేటి సుజాత 
నవతెలంగాణ – నెల్లికుదురు 
రాజ్యాంగం యొక్క రక్షణ కేవలం బీఎల్ పీ పార్టీ తోనే సాధ్యం అని మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కోనేటి సుజాత  అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షులు గద్దల నాగరాజు  అధ్యర్యంలో ఉపాధి కూలీలతో గురువారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాబాసాహెబ్ అంబేద్కర్  ఇచ్చినటువంటి ఓటు హక్కు ద్వారా అధికారంలోకి వచ్చిన నాయకులు ఇప్పుడు పేద ప్రజలను, రైతులను, నిరుద్యోగులను పట్టుచుకోకుండా, స్వంత ఆస్తులు పెంచుకోవడం కోసమే చూస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. బి ఆర్ ఎస్, బిజెపి, కాంగ్రెస్ అన్ని పార్టీలు కూడా రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్రలోనే ఉన్నాయ్ కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఏనుగు గుర్తుకు ఓటు వేసి రాజ్యాంగాన్ని కాపాడాకుందాం అని తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద ప్రజల అభివృద్ధి కోసం ఈ పార్టీలు పట్టించుకోవడం లేదని అన్నారు కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసమే కాలయాపన చేస్తున్నారని తెలిపారు. ఎస్టి సామాజిక వర్గంలో ఎరుకల కులానికి చెందినవారు ఎంతోమంది ఉన్నారని కనీసం వారిని పట్టించుకోవడంలో ఈ ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాలని అన్నారు వీరికి జీవాలు ఉన్నాయని వీరిని ఆయా గ్రామాల్లో ఊరు బయట ఉంచారు తప్ప ఊర్లలో ఉండనివ్వలేదని ఊరు బయట ఉంచేవారని కనీసం వారి బ్రతుకులు ఎలా ఉన్నాయి అని ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు.  స్వాతంత్రం వచ్చి ఎన్నో ఏండ్లు గడిచినప్పటికీ ఇదే సామాజిక వర్గానికి చెందిన వారికి ఏ ఒక్క పార్లమెంటులో గాని అసెంబ్లీలో గాని అవకాశం కల్పించడంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించారని అన్నారు. కనీసం ఇలా చదువుకున్న వరికి  విద్యా ఉద్యోగ రంగాలలో వైద్య రంగాల్లో ఎందుకు మమ్ములను తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు. మీవెంత మా వాటా ఎంత అనే ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర కార్యదర్శి,పార్లమెంట్ ఇంచార్జ్ దార్ల శివరాజ్, జిల్లా అధ్యక్షులు ఇసంపెల్లి ఉపేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల శ్రీను, ఇసి మెంబెర్ తప్పేట్ల చాణిక్య, వనగాండ్ల సాగర్, తదితరులు పాల్గిన్నారు.
Spread the love