– బీఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పరుపాటి వెంకటరెడ్డి
నవతెలంగాణ – నెల్లికుదురు
బీఆర్ఎస్ పార్టీ మహబూబాద్ పార్లమెంటు అభ్యర్థి మాలోతు కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పరుపాటి వెంకటరెడ్డి ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు ఆ పార్టీ జిల్లా నాయకుడు బాలాజీ నాయక్ నల్లని నవీన్ రావు అన్నారు మండలంలోని వస్త్రం తండా, భగ్న తండా, ఎర్రబెల్లి గూడెం, సౌల తండా, కాస్యా తండా, హేమ్ల తండా, బంజారా, గ్రామాలలో గురువారం ఎంపీ అభ్యర్థి కవిత కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థిగా ఉన్న మాలోతు కవిత గతంలో ఎమ్మెల్యేగా ఇప్పుడు ఎంపీగా గెలిచి ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేసిందని అన్నారు కేసీఆర్ తో పోరాడి కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తూ ముందు అడుగు వేసిన వ్యక్తి కేవలం కవిత అని అన్నారు అలాంటి కవితను మళ్ళీ పార్లమెంటు పంపి ప్రతిపక్ష పాత్రలో ప్రజా సమస్యపై గల విప్పేందుకు ఆమె కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించేది గురించి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు గుగులోతు మాన్సింగ్ బానోతు చంద్రు లచ్చు నాయక్ నరేష్ నాయక్ అనిల్ నాయక్ భద్ర నాయక్ దేవేందర్ రవు బత్తిని అనిల్ గౌడ్ భీముడు భోజ్యనాయక్ తదితరులు పాల్గొన్నారు.