మృతుడి కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత

– ఎన్ జిఎఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు చిర్ర యాకాంతం గౌడ్
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో మృతి చెందిన కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని అందజేసినట్లు ఎన్ జి ఎఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు చిర్ర యాకాంతం గౌడ్ తెలిపాడు మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో మృతుడు చింతకుంట్ల సోమయ్య మృతి చెందడం పట్ల సంతాపం ప్రకటించి కుటుంబ సభ్యులను ఓదార్చి ఎన్జీఎఫ్ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యాన్ని కుటుంబ సభ్యులకు అందించే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో ఎవరు మృతి చెందిన ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఈ ఎన్జిఎఫ్ సంస్థ ఆధ్వర్యంలో బియ్యం అందించే కార్యక్రమాన్ని గత కొన్ని ఏండ్ల నుండి నిర్వహిస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే నీ కుటుంబానికి అందిస్తున్నామని తెలిపారు. నిరుపేద కుటుంబాలను ఆదుకోనడమే ఎన్ జి ఎఫ్ సంస్థ లక్ష్యమని తెలిపారు. చింతకుంట్ల సోమయ్య మృతి చెందడం ఎంతో బాధాకరమని తెలిపారు. ఆయన ఎంతోమందికి సేవ చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సేవ చేయడం ప్రతి ఒక్కరు అదృష్టంగా భావించాలని తెలిపారు. అంతేకాకుండా పేద విద్యార్థులను విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామ అభివృద్ధి చెందాలంటే విద్య వైద్య ఆరోగ్యం ముఖ్యమని అందులోనే భాగంగా విద్యార్థులకు ప్రత్యేకమైన క్లాసును ఇప్పించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్స్ SK అజీమ్, వేములకొండ ఉమేష్, రాపాక ప్రవీణ్ కుమార్, సంస్థ సభ్యులు బొల్లు అశోక్, బొల్లు రమణ, చిర్ర వెంకన్న, జెల్ల ఉపేందర్, పెరుమాండ్ల సుమన్, రాపాక నవీన్, ఎండి షరీఫ్, నలమాస శ్రీపాల్, దొంతుల హరీష్, సింగారపు యాకన్న, అక్కెర శ్రీనివాసాచారి కుటుంబ సభ్యులు సైదులు ఉపేందర్ ఎల్లమ్మ ఐలమ్మ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Spread the love