ప్రతి ఒక్కరు చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలి: మట్ట సరిత 

నవతెలంగాణ – నెల్లికుదురు
ప్రతి ఒకరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జి మట్ట సరిత అన్నారు. గురువారం  న్యాయ సేవాధికార సంస్థ తొర్రూర్ వారి ఆధ్వర్యంలో కాచికల్ గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి మరియు చైర్మన్ మండల న్యాయ సేవా సంస్థ శ్రీమతి మట్ట సరిత మాట్లాడుతూ ప్రజలందరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఆమె తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని అన్నారు. రైతులు వ్యాపారస్తుల వద్దకు వెళ్ళినప్పుడు ఏదైనా ఒకటి వస్తువు కొన్నప్పుడు రసీదు పొంది వచ్చి రైతుల విత్తనాలు నాటిన తర్వాత రసీదు మరియు ఉనటువంటి ప్యాకెట్ తోపాటు ప్యాకెట్ లో ఉన్నటువంటి విత్తనాలను ఈ మూడు రకాల వాటిని కవర్లో కట్టి సీజన్ అయ్యేంతవరకు జాగ్రత్తగా దాచి పెట్టాలని అన్నారు. ఆ తర్వాత అనుకోకుండా విత్తనం మొలకెత్తకుండా రైతు నష్టపోయినట్లైతే ఆ మూడు రకాల స్లిప్లను తీసుకెళ్లి వారిపై దావా వేసి జరిగిన నష్టాన్ని పుర్చుకునే అవకాశం ఉందని అన్నారు. అంతేకాకుండా చిన్న చిన్న విషయాల్లో కూడా కేసులు పెట్టుకుని ఏళ్ల తరబడి తిరిగి ఎన్నో ఇబ్బందులు పడ్డ కుటుంబాలు ఉన్నాయని అన్నారు. అలా కాకుండా తగాదాలకు పోకుండా అందరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండి ఎవరి స్థాయిలో వారు నేర్చుకోవాలని అన్నారు వృద్ధాప్య లో ఉన్నటువంటి తల్లిదండ్రులను వారి పిల్లలు వృద్ధలను పోషించకుండా ఇబ్బందుల పాలు చేస్తే వారికి చట్టమైన చర్యలు ఉంటాయని, పేద కుటుంబాల వారు చెందిన వారైతే ప్రభుత్వమే స్వచ్ఛందంగా వారిని పిలిపించి పరిష్కారం చేయిస్తాదని అన్నారు. అంతే కాకుండా కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు భర్త తాగి వచ్చి భార్యను ఇబ్బంది పెట్టిన చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై చట్టమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతులు కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు గిట్టుబాటు ధర లేకుంటే సీసీఐకి మనం పెట్టుకునే అవకాశం ఉందని, దీనికి కూడా ఒక చట్ట ఉంటుందని చట్టపరంగా వెళ్ళినట్లయితే ప్రభుత్వ వాళ్లకు మద్ద ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందని అన్నారు.
భూముల విషయంలో తాత నుండి తండ్రికి తండ్రి కొడుకు కొడుకులు వారి పిల్లలకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అన్నారు. చేసుకోకుండా ఉంటే చాలా సమస్యలు వస్తాయని రేపు కోర్టు వద్దకు వెళ్త వారికి వారి పేరు ప్రూఫ్ ఉండగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. ఆ సమస్య పరిష్కారం అయ్యేసరికి చాలా సమయం పడుతుంది కనుక ఇబ్బందులు నేరుకునే అవకాశం ఉందని అన్నారు. అలా కాకుండా నేరుగా వెంటనే గ్రామంలో వీలునామోన రాయించుకొని వెంటనే సంబంధిత ఆఫీసుకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అన్నారు. మీకు ఎలాంటి సమస్య వచ్చినా ఎవరైనా ఇబ్బంది పెట్టిన మా న్యాయవాదులు ఉంటారని వారి వద్దకు వెళ్లి చెప్పుకుంటే మీ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. పేదవారికి కూడా ఉచితంగా కొంతమందికి న్యాయం చేసేందుకు వీలు ఉందని అన్నారు. ఈ కాచికల్ గ్రామంలో ఎక్కువ కేసు లేకుండా ఉండటం మంచిదని ఈ కాచికల్ గ్రామ ప్రజలు మంచివారని అభిప్రాయం తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఘనపురం రామకృష్ణ(ఆర్కే), నెల్లికుదుర్ సబ్-ఇన్ స్పెక్టర్ కనుకుల క్రాంతికిరణ్, మండల వ్యవసాయ అధికారి నెలకుర్తి రవీందర్ రెడ్డి, న్యాయవాదులు బండపల్లి వెంకన్న, మైలపాక అశోక్, గంపల ప్రవీణ్, కోర్టు సిబ్బంది, పోలీసు సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Spread the love