నవతెలంగాణ – నెల్లికుదురు
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గుగులోతు బాలాజీ నాయక్ మండల కేంద్రం పట్టణ అధ్యక్షుడు రత్నపురం యాకయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలో పట్టభద్రుల వద్దకు వెళ్లి ఓటు వాడికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గుర్తుపై ప్రతి ఒక్కరు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకొని ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. సట్ల యాకయ్య సంతోష్ మోహన్ వారి పల్లి చందర్, వెన్నం భాస్కర్, సతీష్, నరేష్, నత్తిరి మల్లయ్య, మద్ది వెంకటేశ్వర్ల పటేల్, నరేష్, పులి, శ్రీను, హెచ్ రవి, హెచ్ మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.