
– లారీలు లేక కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం..
– బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు..
నవతెలంగాణ – వేములవాడ
రైతుల సమస్యలు ప్రభుత్వం గాలికి వదిలేసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అమెరికాకు, దుబాయ్ కి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వెళ్లారని వేములవాడ బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సమావేశం నిర్వహించి రైతులకు అందించబోయే సంక్షేమ పథకాలు వివరించడంలో విఫలమైందని, రైతుబంధు ను రైతు భరోసాగా అందజేస్తామని ఎన్నికల హామీ ఇచ్చి ఇప్పుడు మంత్రులు మాట దాటవేసే సమాధానం ధోరణిపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రకృతి కనికరిస్తే తప్ప రైతులకు వేరే మార్గం లేనట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని కాలేశ్వరం జలాలపై స్పష్టత రైతులకు ఇవ్వాల్సిన ఉందని ఆయన ప్రశ్నించారు. వేములవాడ సహకార సంఘం పరిధిలోనే ఇంకా 60 వేల క్వింటాళ్లు కల్లాలలోనే ఉన్నాయన్నారు.తూకం వేసిన పదవేల బస్తాలు కల్లాల లోనే ఉన్నాయని వీటిపై అధికారులు నిలదీస్తే 4, 5వేల బస్తాలకు మాత్రమే అనడం విడ్డూరంగా ఎద్దేవా చేశారు. కొనుగోలులో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి విషయాన్ని ముందస్తుగా వెల్లడించే ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దుబాయ్ ఎందుకు వెళ్లారో ప్రజలకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. రైతులు ధాన్యాన్ని అమ్ముకునేందుకు నానా తంటాలు పడుతుంటే విదేశీ పర్యటనపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుందని అన్నారు. గత ఆంధ్ర పాలకుల సమయంలో ఈ ప్రాంతంగా కరువు ప్రాంతంగా ఉండి, ఒక్క మీ రుద్రంగి నుండి 2000 మందికి పైగా ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లారని అన్నారు. స్వరాష్ట్రంలో సాగునీటి వనరులు పెరిగాక తిరిగివచ్చి నీ రుద్రంగి గ్రామంలోనే చాలామంది వ్యవసాయ మీదే ఆధారపడి కుటుంబాలతో కలిసి ఉంటున్న విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. మీ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం చేస్తూ, సమస్యలను గాలికి వదిలేస్తున్న తీరు మరోసారి ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా తీర్చి మళ్లీ గల్ఫ్ దేశాల బాట పట్టే విధంగా చేస్తున్నట్టుగా కనిపిస్తుందని ఆరోపించారు. మరో 30 శాతం ధాన్యం ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో ఉందని వెంటనే వాటిని కొనుగోలు చేయాలని బి ఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
ముంపు గ్రామాల ప్రజలకు ఐదు లక్షల 4వేలు ఎప్పుడిస్తారు..
ముంపు గ్రామాలకు ఎన్నికల సమయంలో ఐదు లక్షల 4 వేల రూపాయలు ఇస్తామని నమ్మ బలికిన మీరు సీఎం రేవంత్ రెడ్డితో ఏ సమయంలోపు ఇస్తారు ప్రకటన చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలో మీరు ఎన్ని ప్రజలకు నెరవేర్చారు ప్రజలకు బాహాటంగా చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కందుల క్రాంతి కుమార్, కౌన్సిలర్లు నిమ్మశేట్టి విజయ్, జోగని శంకర్, సిరిగిరి రామచందర్, , గోలి మహేశ్, నాయకులు కమలాకర్ రెడ్డి, వెంగళ శ్రీకాంత్, ఈర్లపల్లి రాజు, సందీప్ మైలారపు రాము తోపాటు తదితరులు పాల్గొన్నారు.