
మండలంలోని వావిలాల గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నల్లమాస బిక్షపతి కి ప్రమాద అవశ్యత్తుతో కాలు విరగడంతో కార్యకర్తలతో వెళ్లి శనివారం రాత్రి మహబూబాద్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎదల యాదవ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు ఈ వావిలాల గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుడు నల్ల మాస బిక్షపతి ఎంతగానో కృషి చేస్తున్నాడని అన్నారు. ఆయన కార్యకర్తలతో కలిసి గ్రామాన్ని అభివృద్ధి పనులు చేసేందుకు పెద్దల దృష్టికి తీసుకెళ్లి అట్టి పనులను చేసే విధంగా క్రియాశీలకంగా చురుకైన వ్యక్తిగా కొనసాగుతున్నాడు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏ ఆపద వచ్చిన కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. ప్రజల సమస్యపై నిరంతరం శ్రమించే వ్యక్తి అని అలాంటి వ్యక్తికి ప్రమాదవశతో బయటపడటం ఎంతో అదృష్టమని అన్నారు. ఆయన తొందరగా కోలుకోవాలని ఈ సందర్భంగా కోరినట్టు తెలిపారు. ఈయన ప్రతి రోజు పేద ప్రజల అభివృద్ధి కోసం పేద ప్రజల రాష్ట్ర సుఖాల్లో పాలుపంచుకునే వ్యక్తి అన్నాడు. ఈ కార్యక్రమంలో నాయకులు నలమాస శ్రీనివాస్ చిర్ర బుచ్చిరెడ్డి, బొల్లెపల్లి సతీష్ చిర్రా వెంకటరెడ్డి, తవిశెట్టి రాకేష్, తవిశెట్టి ప్రవీ,ణ్ ఆనంద్ ఝాటోత్ వీరన్న, వాంకుడోత్ బిక్ష గోగుల మల్లయ్య, గోగుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.