వానాకాలం పంటలపై రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన 

– నెల్లికుదురు మండల వ్యవసాయ విస్తరణ అధికారులు 
నవతెలంగాణ – నెల్లికుదురు
వానాకాలం వంటలపై రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నెల్లికుదురు మండల వ్యవసాయ విస్తరణ అధికారులు చిన్నముప్పారం క్లస్టర్ ఏఈఓ ముజాహిద్, చిన్ననాగారం క్లస్టర్ ఏఈఓ సుమన్, మునిగలవీడు క్లస్టర్ ఏఈఓ కల్యాణి, ఆలేరు క్లస్టర్ ఏఈఓ శిరీష, యెర్రబెల్లిగూడెం క్లస్టర్ ఏఈఓ చందనలు తెలిపారు మంగళవారం మండల వ్యవసాయ అధికారి నేలకుర్తి రవీందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయా క్లస్టర్ గ్రామాలలో ఉన్న రైతులకు ముందస్తు ప్రణాళికలు కొనుగోలు చేసిన విత్తనాలు పై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే వానాకాలం సీజనులో పత్తి పంట రైతులు సాధారణ పద్దతిలో కాకుండా  అధిక సాంద్రత – అధిక దిగుబడి నూతన పంట విధానంకు వెల్లినట్లైతే అధిక దిగుబడులు సాధించవచ్చు అన్నారు పత్తిలో స్వల్ప కాలపరిమితి పత్తి వేయడం ద్వారా గులాబీ పురుగు ఎదుర్కోవడం మరియు అధిక దిగుబడి సాదించి, తదుపరి నవంబర్ చివరనాటికి యాసంగీ రెండో పంటకు వెళ్ళవచ్చు అని రైతులకు తెలిపారు, ఈ అధిక సాంద్రత విధానం లో సాలుకి సాలుకి మధ్య దూరం రెండున్నర అడుగులు (2ఫీట్ల 6ఇంచులు),మొక్కకి మొక్కకి మధ్య దూరం అర ఫీట్(6ఇంచ్ల) దూరం పాటించాలన్నారు. సాధారణ పద్దతిలో ఏకరానికి 6 వేల నుండి 8 వేల మొక్కలు వస్తే ఈ పద్దతిలో 18 నుండి 20 వేల మొక్కలు వేసుకోవడం జరుగుతుంది అన్నారు.
మొక్కలు ఎక్కువగా పెరగకుండా పరిస్థితిని బట్టి రెడు సార్లు 45 రోజులకు ఒకసారి, 65 రోజులకు ఒకసారి మెపిక్వాట్ క్లోరైడ్(ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్) మందును పిచికారి చేసుకోవాలి, దీనిద్వారా మొక్క ఎక్కువగా పెరగకుండా పూత పిందె ఎక్కువ వస్తుంది ఈ మందును వేరే పురుగుల మందు లో కలిపి కూడా కొట్టవచ్చును అని రైతులకు సూచించారు. పంట 85వ రోజు దశలో తల కొసలు తుంచడం ద్వారా మొక్క యెత్తు పెరగకుండా ఆ బలాన్ని పూత పిందే గ్రహించి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం కలదు.  మన ఎర్ర నేలలు మరియు తక్కువ బలం కల నేలలు ఈ రకమైన పంటకు ఎక్కువ అనుకూలం, అదే గనుక మంచి సేంద్రీయ నల్ల రేగడి నేలల్లో మొక్క శాకీయ పెరుగుదల ఎక్కువగా దిగుబడి తక్కువ వుండి ఈ రకమైన పంట విధానానికి అనుకూలం కాదని పంట పెరుగుదలను నియంత్రించడం వలన, పత్తి మొత్తం ఒకేసారి కాసి, ఒకటి రెండు పిక్కింగులలోనే మొత్తం పత్తి వస్తుంది సాధారణ పద్దతిలో కంటే 30 నుండి 50 శాతం అధిక దిగుబడి వస్తుంది, ప్రస్తుతం మార్కెట్ లో నూజివీడు వారి అర్మిత, విన్నర్, సిరి, రాసి కంపనీ వారి RCH929, స్విఫ్ట్ లు అందుబాటులో కలవు వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు మరియు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు లేబుల్ లేని విత్తనాలు, లూజ్ విత్తనాలు కొనకూడదు, లైసెన్స్ పొందినటువంటి డీలర్ వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి, విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు లాట్ నెంబరు, బ్యాచ్ నంబరు ఎక్స్పైరీ డేటు, ఎమ్మార్పీ రేటు అన్ని చూసుకోవాలి, విత్తనాలు కొన్న తర్వాత తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి,మనం కొనుగోలు చేసినటువంటి విత్తనాన్ని రసీదు మీద రాసిండా లేదా అనేది తప్పనిసరిగా చూసుకోవాలి,ఏ పంట విత్తనమైన సరే పంట కోత అయిపోయే వరకు రసీదు ను జాగ్రత్తగా ఉంచుకోవలెనని అది మీ బాధ్యత అని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లికుదుర్ మండలం వ్యవసాయ వివిధ క్లస్టర్ల పరిధిలో చిన్నముప్పారం క్లస్టర్ ఏఈఓ ముజాహిద్, చిన్ననాగారం క్లస్టర్ ఏఈఓ సుమన్, మునిగలవీడు క్లస్టర్ ఏఈఓ కల్యాణి, ఆలేరు క్లస్టర్ ఏఈఓ శిరీష, యెర్రబెల్లిగూడెం క్లస్టర్ ఏఈఓ చందనలు ఆయా కష్టాల రైతులు పాల్గొన్నారు
Spread the love