
– మండల వ్యవసాయ అధికారి నెలకుర్తి రవీందర్ రెడ్డి
నవతెలంగాణ – నెల్లికుదురు
కీర్తన మరియు ఎరువుల డీలర్లు రైతుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకు నాసిరకం విత్తనాలను అమ్మినట్లయితే విత్తన చట్టం ద్వారా చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారి నెలకుర్తి రవీందర్ రెడ్డి తెలిపాడు. మండల కేంద్రంలోని రైతు వేదిక లో డీలర్లు వానాకాల పంటలపై తీసుకోవాల్సిన విషయాలపై బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీలర్లు అందరూ కూడా విత్తనాలు అమ్మేటప్పుడు ప్రతి రైతుకు కచ్చితంగా రసీదు ఇవ్వవలసి ఉంటుంది. ఈ రసీదులో విత్తనాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా రాసి రైతు యొక్క సంతకం తీసుకొని ఇవ్వవలసి ఉంటుంది. ఎవరైనా నాసిరకం విత్తనాలు అమ్మినట్లయితే వారి పైన విత్తన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. డీలర్లు అందరూ కూడా అమ్మినటువంటి విత్తనాల వివరాలు రైతు వారిగా రిజిస్టర్లో నమోదు చేయవలసి ఉంటుంది. ఇలా నమోదు చేసిన వివరాలను రోజువారీగా వ్యవసాయ అధికారి మరియు విస్తరణ అధికారులు రిజిస్టర్ ఫోటోలు తీసి జిల్లా వ్యవసాయ అధికారికి పంపించవలసి ఉంటుంది అని తెలిపారు. డీలర్లు ఎవరైనా వ్యవసాయ శాఖ నియమ నిబంధనలు కనుగుణంగా నడుచుకోనట్లయితే వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి అని తెలిపడు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి వల్లంల ప్రవీణ్ వివిధ గ్రామాల విత్తనాల డీలర్లు పాల్గొన్నారు.