గోదావరిఖని మార్కండేయ కాలనీ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన రెడ్ బకెట్ బిర్యానీ సెంటర్ పారంభోత్సవం బుధవారం జరిగింది. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మహాంకాళి స్వామి, నగర కాంగ్రెస్ అధ ్యక్షుడు బొంతల రాజేష్, కార్పొరేటర్ పొన్నం విద్య లక్ష్మణ్ గౌడ్లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారం భించారు. గోదావరిఖని ప్రాంత ప్రజలకు రుచికరమైన బిర్యాని అందించడానికి రెడ్ బకెట్ బిర్యానీ కంపెనీ ప్రాధాన్యతనిస్తుందని, ప్రస్తుతం గోదావరిఖని ప్రాంతంలో ఉన్న ప్రధాన రెస్టారెంట్లకు దీటుగ – నాణ్యత ప్రమాణాలకు లోబడి రుచికరమైన బిర్యానీని అందజేస్తామని ప్రోపరేటర్ పొన్నం రామ్మూ ర్తి గౌడ్, సన్నీ అన్నారు. ఈ ప్రాంత బిర్యాని ప్రియులకు రుచికరమైన బిర్యాని వంటకాలను అందజే స్తామని తెలిపారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి భోజనం చేసేలా బిర్యానీ సెంటర్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పాతపల్లి ఎల్లయ్య, దీటి బాలరాజు, 5 కార్పొరేటర్లు మంచికట్ల దయాకర్, కొమ్ము వేణు, గణ్ముకుల తిరుపతి, కాల్వ సంజీవ్, దుబాసి మల్లేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.