Sunday, June 29, 2025
E-PAPER
Homeసినిమాధగడ్‌ ఆగయా..

ధగడ్‌ ఆగయా..

- Advertisement -

హీరో నాని తాజాగా నటిస్తున్న ‘ది పారడైజ్‌’ సినిమా షూటింగ్‌లోకి అడుగు పెట్టారు. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి ఈ మూవీని భారీగా నిర్మిస్తున్నారు. ‘దసరా’ బ్లాక్‌ బస్టర్‌ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల ఈ చిత్రం కోసం మరోసారి చేతులు కలిపారు. ఈనెల 21న షూటింగ్‌ ప్రారంభమైంది. నాని శనివారం సెట్స్‌లోకి అడుగుపెట్టారు. వారం పాటు సాగిన కీలకమైన చైల్డ్‌ వుడ్‌ సన్నివేశాల చిత్రీకరణతో ఈ సినిమా జర్నీ ప్రారంభమైంది. ఇప్పుడు నాని ఎంట్రీ ఇచ్చారు. ‘ధగడ్‌ ఆగయా!’ అంటూ అమెజింగ్‌ అనౌన్స్‌మెంట్‌తో లుక్‌ రిలీజ్‌ చేశారు. బరువైన బార్బెల్‌ వెయిట్స్‌పై నాని కాలు మాత్రమే కనిపించే పోస్టర్‌లో ‘ఈసారి నాని మరింత ఫెరోషియస్‌ వస్తున్నాడు’అనే క్యాప్షన్‌ ఆకట్టుకుంది.
40 రోజుల హైదరాబాద్‌ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంతో పవర్‌ఫుల్‌ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన గ్రాండ్‌ సెట్స్‌లో ఈ షూటింగ్‌ జరగనుంది. ‘దసరా’ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో అదరగొట్టింది. ‘ది పారడైజ్‌’ గ్లోబల్‌ లెవెల్‌కు వెళ్లబోతోంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్‌, స్పానిష్‌ ..ఇలా 8 భాషలలో విడుదల కానుంది. టైటిల్‌ పోస్టర్‌, గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా గ్లింప్స్‌లో ఉన్న పవర్‌ఫుల్‌ డైలాగ్‌, విజువల్స్‌, రాక్‌స్టార్‌ అనిరుధ్‌ రవిచంద్రన్‌ మ్యూజిక్‌, నాని స్ట్రాంగ్‌ ఎంట్రీ… ఇవన్నీ సినిమా పై హ్యుజ్‌ బజ్‌ క్రియేట్‌ చేశాయి. వచ్చే ఏడాది మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్‌ ప్రకటించారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: శ్రీకాంత్‌ ఓదెల, నిర్మాత: సుధాకర్‌ చెరుకూరి, సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: అవినాష్‌ కొల్లా, ఆడియో: సరిగమ మ్యూజిక్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -