- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం) : కాటారం డీఎస్పీగా సూర్యనారాయణను నియమిస్తూ డీజీపీ డాక్టర్ జితేందర్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇక్కడ డీఎస్పీగా పని చేసిన గడ్డం రామ్మోహాన్ రేడ్డిని గత నెలలో బదిలీ చేసి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఈ నెల12న డీఎస్పీ సూర్యనారాయణను కాటారంనకు అటాచ్ చేయగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. తాజాగా పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
- Advertisement -