నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
వచ్చే ఆగస్టు 5 వ తేదీ లోగా అర్హులైన రైతులందరూ రైతు బీమా కోసం నమోదు చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తేదీ 14-08-1965 నుండి14-08-2006 వరకు పుట్టిన వారై ఉండాలని, తేదీ 28-06-2024 లోపు పట్టాదారు పాస్ బుక్ పొందిన రైతులు అర్హులని తెలిపారు. 18 సంవత్సరాలు నిండి, 59 సంవత్సరాల మధ్యలో ఉన్న రైతులు అర్హులని తెలిపారు. కొత్తగా పట్టాదారు పాస్ బుక్ పొందిన రైతులు, ఇదివరకు రైతు బీమా నమోదు చేయని రైతులు వారి యొక్క పట్టాదార్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, నామిని పేరు, వారి నామిని ఆధార్ కార్డు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి (ఏఈఓ) గ్రామంలోని రైతు వేదికలో అందజేసి రైతు బీమా నమోదు చేయించుకోవాలని కోరారు.