విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేసిన కార్పొరేటర్

నవతెలంగాణ – కాప్రా
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ మండలంలోని తిరుమలనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు మరియు యూనిఫాంలు పంపిణీ చేసిన స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్. అనంతరం ప్రభుదాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రెండు జతల యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తుందని, మంచి పోషకాలతో కూడిన సన్నబియ్యం ఆహారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. పేద ప్రజలకు గురుకులాల ద్వారా ఉచితంగా ఉన్నత విద్యను అందించడం, అలాగే ప్రభుత్వ విద్యావ్యవస్థల బలోపేతం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు రాకేష్, అనితరాణి, అరుణాదేవి, గాయత్రి, సరిత, హరిష్చంద్, సిబ్బందితో పాటు కాలనీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, మురళీకృష్ణ, చంద్ర శేఖర్, రాజు, శశికళ, స్థానిక నాయకులు శేఖర్ గౌడ్, దండెం నరేందర్ పాల్గొన్నారు.

Spread the love