- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
జిల్లాలోని ఎల్లమ్మ గుట్ట మున్నూరు కాపు సంఘంలో తెలంగాణ మున్నూరు కాపు సంఘం ఉమ్మడి జిల్లాల కార్యవర్గ సమావేశం బుధవారం నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా తెలంగాణ మున్నూరు కాపు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల ప్రవీణ్ , మున్నూరు కాపు యువత రాష్ట్ర అధ్యక్షులు బండి సంజీవ్ అధ్యక్షతన తెలంగాణ మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన కలిగోటా ప్రశాంత్ నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు వారికి అభినందన తెలియజేస్తూ.. మున్నూరు కాపు అభివృద్ధికి తోడ్పడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -