- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని సిద్ధ రామేశ్వర గ్రామానికి చెందిన రజక సంఘం సభ్యులు మంగళవారం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో మడేల్లయ్య ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ఆలయ నిర్మాణానికి సహకరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -