నవతెలంగాణ – చిన్నకోడూరు
అమర వీరుల ఆత్మ త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆలోచన విధానాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు చిన్నకోడూరు ఎంపిపి ఉపాధ్యక్షులు కీసరి పాపయ్య అన్నారు. ఎంపిపి ఉపాధ్యక్షులు కీసరి పాపయ్య అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం గురువారం నిర్వహించారు. ముందుగా అమర వీరుల స్థూపం ఫ్లెక్సి కు పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి ,సంక్షేమ పథకాలలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. రైతులకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని రైతు సంక్షేమం కోసం రైతు భీమా ,రైతు బంధు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తుందని తెలిపారు. మంత్రి హరీష్ రావు నాయకత్వంలో చిన్న కోడూరు మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపిటిసిల పోరం మండల అధ్యక్షుడు ఇట్టబోయిన శ్రీనివాస్, వివిధ గ్రామాల ఎంపిటిసిలు, సర్పంచులు,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.