– ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు వంశీధర్ రెడ్డి
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతామని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు గవ్వ వంశీధర్ రెడ్డి విమర్శించారు. గురువారం హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 84 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు గవ్వ వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 83 వసంతాలు పూర్తి చేసుకొని 84 వ వసంతంలోకి అడుగుపెడుతుందనారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పేరు గొప్ప ఊరు దిబ్బ అనే విధంగా ప్రభుత్వ ఈ విధానాలు ఉన్నాయన్నారు. రైతులను విద్యార్థులను యువకులను ఇబ్బందులకు గురిచేసే పనులు కేంద్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనులు చేయాలని హితవు పలికారు. రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల పేరుతో విద్యార్థులను యువకులను అయోమయానికి గురి చేస్తుందన్నారు. నోటిఫికేషన్లు పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడం బాధాకరం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని అన్నారు. దేశంలో రాష్ట్రంలో నిత్యవసర వస్తువుల ధరలు నియంత్రణలో లేకుండా పోయాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే నియంత్రణలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో రెండు ప్రభుత్వాలకు ఈ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు ఈ కార్యమంలో కన్వీనర్ పశ్చిమట్ల రవీందర్ గౌడ్, నాయకులు పచ్చిమట్ల మనోహర్ గౌడ్, గట్టు మల్లేష్, పూదరి రవీందర్ గౌడ్ , దుద్దెడ రాజేష్, మునిగంటి శ్రీనివాస్, గడిపే సుజిత్, గుళ్ల సృజన్, అజయ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.