అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుండి అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాల్వాయి చెన్నారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు అన్నారు. శనివారం మండలంలోని చల్మెడ గ్రామానికి చెందిన గాదేపాక సురేష్ కు అనారోగ్యానికి గురై ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి అండగా ఉండేందుకు ఎమ్మెల్యే కోమటి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన 54 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే ప్రత్యేక క్యాంప కార్యాలయంలో లబ్ధిదారునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వేమిరెడ్డి జితేందర్ రెడ్డి,మాజీ సర్పంచ్ లు జాల వెంకటేశ్వర్లు, బూడిద లింగయ్య, మాజీ ఎంపీటీసీ పందుల భాస్కర్, యువజన కాంగ్రెస్ నాయకులు జంగిలి నాగరాజు, చల్మెడ గ్రామశాఖ అధ్యక్షులు కొంక చంద్రయ్య, కొంక శంకర్, కర్నాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.