చండూర్ హైస్కూల్లో వంట చేసే తమపై అసభ్య పదజాలంతో ప్రిన్సిపల్ దూషిస్తున్నాడని అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు వంట చేసే మహిళలు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్, ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర, డిఈఓ బిక్షపతి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ.. స్వాతిముత్యం మహిళా సమభావన సగం నుండి గత పది సంవత్సరాలుగా విధులు నిర్వహించినట్లు తెలిపారు. ఇటీవల కాలంలోనే తమను విధుల నుండి తొలగించి ఇతర ప్రైవేటు వ్యక్తులను పెట్టుకున్నాడని ఆరోపించారు. విషయంపై వివరణ అడగగా నాకు ఇష్టం వచ్చిన వారిని పెట్టుకుంటాను ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోనని దుర్భాషలాడినట్లు తెలిపారు. ఈ విషయంపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. అనంతరం ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ విద్యార్థులు 400 మంది ఉంటే ప్రతి ఒక్కరికి ఎనిమిది రూపాయలు చొప్పున 30 రోజులకి ఒక లక్ష రూపాయల పైచిలుకు డబ్బులు వస్తే మహిళా సంఘం అకౌంట్ లో జమ కాకుండా సదురు హెడ్మాస్టర్ తన సొంత అకౌంట్ లో వేసుకొని వారికి కేవలం 15 వేల రూపాయలు ఇస్తున్నారని ఆరోపించారు. ఈతంగా గత పది సంవత్సరాmలుగా ఇతర హెడ్మాస్టర్ లు కూడా చేశారని, తన అకౌంట్లో డబ్బులు వేయించుకుంటూ మహిళా సంఘం అకౌంట్ లో డబ్బులు వేయకుండా వర్క్ కట్ చేసి డబ్బులు చెల్లిస్తున్నారని, ఇదేంటని అడిగిన వారిని విజ్రాల నుండి తొలగించి ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుంటున్నారని తెలిపారు. విషయంపై వెంటనే విచారణ జరిపి చర్యలు సంబంధిత హెడ్మాస్టర్ పై తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్, నవదీప్, శేఖర్, కిరణ్, సంగం సెంట్రల్ కమిటీ సభ్యులు కిన్నర జగదీష్, ఎం. యాదయ్య, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న, రాష్ట్ర కోఆర్డినేటర్ బాకీ తరుణ్, తదితరులు పాల్గొన్నారు.