చౌటుప్పల్ మండల కేంద్రంలో త్రిబులార్ 3జి నోటిఫికెషన్ భూ నిర్వసితుల సమావేశాన్ని రైతులు బుధవారం బహిష్కరించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. త్రిబులార్ అలైన్మెంట్ మార్చాలని నినాదం చేస్తూ భూసేకరణకు ఒప్పుకోమని నార్త్ సైడ్ త్రిపల్ ఆర్ అలైన్మెంట్ నీ ఓఆర్ఆర్ నుండి 28 కిలోమీటర్ల కి పరిమితం చేశారని అన్నారు. దీని వలన చౌటుప్పల్ మున్సిపాలిటీ రెండు మూడు భాగాలుగా విడిపోతున్నవని అన్నారు. 40 కిలోమీటర్లకు అలైన్మెంట్ మార్చితే మున్సిపాలిటీ విడిపోకుండా గ్రామీణ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. మున్సిపాలిటీలోని భూముల బహిరంగ మార్కెట్ వాల్యూ సుమారుగా రూ.2-5 కోట్లు, హెచ్ఎండిఏ ప్లాట్లు గజానికి సుమారుగా రూ.20 వేలు ఉండగా. ప్రభుత్వం మాత్రం నష్టపరిహారము ఎకరాకి రూ.20 నుంచి 30 లక్షలు, హెచ్ఎండిఏ ప్లాట్లలో గజానికి రూ.5-6 వేలు వరకే ఇస్తా మంటున్నారని వాపోయారు. గతంలో తమ భూములను ప్రభుత్వ ప్రాజెక్టులు అయిన నేషనల్ హైవేల కోసం,విద్యుత్ స్తంభాల కోసం మరియు నీటి కాలువల కోసం కోల్పోయామని ఇప్పుడు ట్రిపులర్ వలన ఉన్న కాస్త భూమి కోల్పోతున్నామని తెలిపారు. దీనివలన రైతులు బిచ్చగాళ్ళు అయిపోయే పరిస్థితి వచ్చిందని వాపోయారు. సౌత్ సైడు త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ఓఆర్ఆర్ నుండి 40 కిలోమీటర్లకు చేస్తున్నట్లుగా నార్త్ సైడ్ అలైన్మెంట్ ని కూడా శాస్త్రీయబద్ధంగా 40 కిలోమీటర్లుకి మార్చాలని లేదా బహిరంగ మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం ఇస్తూ జీవనోపాధి కల్పించాలని చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ కుమార్ ని,చౌటుప్పల తాసిల్దార్ నీ కలిసి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితులు సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి చౌటుప్పల్ మాజీ జెడ్పిటిసి పెద్దేటి బుచ్చిరెడ్డి బిజెపి మండల నాయకులు గుజ్జుల సురేందర్ రెడ్డి రైతు సంఘం నాయకులు బూరుగు కృష్ణారెడ్డి, సంత గళ్ళ మల్లేష్ గౌడ్ వందలాది భూ నిర్వాసితులు, ప్లాట్ల యజమానులు తదితరులు పాల్గొన్నారు.