ప్రజావాణిలో వచ్చే ప్రతి అర్జీని పరిష్కరించాలి

Every plea in public should be addressed– జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) పి. రాంబాబు..

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ప్రజావాణి లో వచ్చే ప్రతి దరఖాస్తుని పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ ) పి.రాంబాబు అధికారులను ఆదేచించారు. సోమవారం ఐడిఓసి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమం లో పాల్గొని అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తు లు వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖ అధికారులకు సూచించారు. ఆయా శాఖలలో ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ దరఖాస్తులనుపరిష్కరించాలని, తదుపరి వచ్చే వారం నిర్వహించు ప్రజావాణిలో అట్టి దరఖాస్తుల స్థితిగతులను వివరించాలని అదనపు కలెక్టర్ సూచించారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండలాల ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం ని తరలించాలని సూచించారు.ప్రజావాణి లో భూ సమస్య లపై 16 దరఖాస్తులు,డి డబ్ల్యూ ఓ 4,డి. ఆర్. డి. ఓ 6, డిపిఓ 1, డిఏఓ 7, ఇతర శాఖలకు సంబంధించి 24, మొత్తం 58 దరఖాస్తు లు అందాయని సంబంధిత శాఖలకు తదుపరి చర్యలకై పంపించటం జరిగిందని ఈ సందర్బంగా కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమం లో డిఆర్ డి ఓ అప్పారావు,డి ఏ ఓ శ్రీధర్ రెడ్డి, డి డబ్ల్యూ ఓ నరసింహారావు ,సంక్షేమ అధికారులు శంకర్, లత, బి. సి. వెల్ఫేర్ అధికారి అనసూర్య, డిసిఓ పద్మజ, డిపిఓ నారాయణ రెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఆర్జిదారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love