
భువనగిరి మండలంలో సామాజిక, ఆర్థిక ,విద్య ఉపాధి, రాజకీయ, కుల సర్వే కార్యక్రమాన్ని బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ గంగాధర్ పరిశీలించారు. అనంతరం వడాయిగూడెం గ్రామపంచాయతీని సందర్శించి, హౌస్ లిస్టింగ్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సర్వే ఎలాంటి తప్పులు లేకుండా వాస్తవమైన సమాచారం వచ్చే విధంగా ఎన్యుమరేటర్లు కుటుంబ సభ్యుల వద్ద నుండి సమాచారాన్ని సేకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎన్ శోభ రాణి, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.