నవతెలంగాణ – భువనగిరి
రాబోవు యాసంగి కాలానికి యాదాద్రి భువనగిరి జిల్లాలో సరిపడ వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ తెలిపారు. విత్తన దుకాణ డీలర్లకు వారి వద్ద ఉన్న విత్తన వివరాలను స్టాక్ బోర్డులపై ప్రదర్శించాలని, విత్తనాలను మద్దతు ధర కంటే ఎక్కువగా అమ్మ కూడాదని, మరియు విక్రయించిన విత్తనాలకు సరైన బిల్లులు ఇవ్వవలసిందిగా ఆదేశించారు. ఏ విత్తన దుకాణ డీలరు గాని పైన ఆదేశాలను ఊల్లంగించినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకోని, విత్తన లైసెన్సులు రద్దు చేయబడతాయని తెలిపారు. విత్తన దుకాణా డీలర్ ఎవరైనా ఒకటో గల కు పాల్పడినట్లైతే వెంటనే వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని రైతులకు తెలిపారు.