మాజీ మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

నవతెలంగాణ- భిక్కనూర్
మాజి మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ షబ్బీర్ అలీకి భిక్కనూర్ మండల కాంగ్రెస్ నాయకులు కామారెడ్డిలోని ఆయన నివాసంలో బక్రీద్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, డిసిసి జిల్లా ఉపాధ్యక్షులు మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, నాయకులు సుధాకర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, సురేష్, లింగారెడ్డి, తదితరులు ఉన్నారు.

Spread the love