రైతుభీమా చేయించుకోని రైతులు దరఖాస్తు చేసుకోవాలి..

– మండలాల వ్యవసాయ అధికారులు.. రాంబాబు, ప్రవిన్ కుమార్..
నవతెలంగాణ -డిచ్ పల్లి
డిచ్ పల్లి, ఇందల్ వాయి మండలాల పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన రైతులు కొత్తగా పాస్ బుక్స్ పొంది ఇప్పటి వరకు రైతుభీమా చేయించుకోని 18-59 సంవత్సరాల వయసు గల రైతులు వెంటనే ఆయా క్లస్టర్ల ఎఈఓ లకు రైతు బీమా దరఖాస్తులు అందజేయాలని డిచ్ పల్లి,ఇందల్ వాయి మండలాల వ్యవసాయ శాఖ అధికారులు రాంబాబు, ప్రవిన్ కుమార్ లు వేర్వేరు ప్రకటనల్లో మంగళవారం తెలిపారు. రైతులు పట్టాదార్ పాసుబుక్ జిరాక్స్,ఆధార్ కార్డు జిరాక్స్,నామినీ ఆధార్ కార్డు జిరాక్స్,అప్లికేషన్ ఫారం తీసుకుని క్లస్టర్ల ఎఈఓ లను తమ కలిసి రైతుభిమా లో ఎన్రోల్ చేయించుకోవాలని సూచించారు.రైతు బీమా ఏడాదికి ఒకసారే ఉంటుందని ఈ అవకాశాన్ని రైతు బీమా లేని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, గతంలో రైతు బీమా చేయించుకున్న రైతులు మరోసారి చేసుకోవాల్సిన అవసరం లేదని వారన్నారు.
Spread the love