- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోనీ రెడ్డిపేట్, మద్దికుంట, రామారెడ్డి , ఇస్సన్నపల్లి, కన్నాపూర్ తో పాటు పలు గ్రామాల్లో 36.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. కన్నాపూర్ గ్రామ పరిసర ప్రాంతంలో గల కొత్తచెరువు అలుగు పాక్షికంగా తెగి నీరంతా వృధాగా పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని రైతుల కోరుతున్నారు. గత 15 రోజుల నుంచి వర్షాలు లేకపోవడంతో ఆందోళన చెందిన రైతులకు ఈ భారీ వర్షంతో ఊరట కలిగించింది. రైతులంతా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
- Advertisement -