సిబ్బందిని పర్మిట్ చేసేవరకు సమ్మె ఆగదు: నాయక్ వాడి శ్రీనివాస్

నవతెలంగాణ -నవీపేట్: గ్రామపంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేసే వరకు సమ్మెను కొనసాగిస్తామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాయక్ వాడి శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలో అమర వీరుల స్థూపానికి నివాళులర్పించి గురువారం సమ్మెను ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయక్ వాడి శ్రీనివాస్ మాట్లాడుతూ జీఒ 60 ప్రకారం జిపి సిబ్బందికి వేతనాలను చెల్లిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రమాద బీమాతో పాటు సమ్మె డిమాండ్లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేకల ఆంజనేయులు, లక్ష్మయ్య, రాములు, పోశెట్టి, భూషణ్, దేవకి, లలితా మరియు కార్మికులు పాల్గొన్నారు.
Spread the love