పాలస్తీనీయన్లకు ఆ హక్కు ఉండదు : ట్రంప్‌

ఇజ్రాయిల్‌ దాడులతో శిథిల నగరంగా మారిన గాజాను స్వాధీనం చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌వాషింగ్టన్‌: ఇజ్రాయిల్‌ దాడులతో శిథిల నగరంగా మారిన గాజాను స్వాధీనం చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చెబుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై మాట్లాడుతూ తన ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం.. పాలస్తీనీయన్లకు గాజాకు తిరిగి వచ్చే హక్కు ఉండదని పేర్కొన్నారు. ఫాక్స్‌ న్యూస్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గాజా ప్రణాళిక గురించి మాట్లాడారు.”నేను గాజాను స్వాధీనం చేసుకుంటా. నా ప్రణాళిక ప్రకారం.. పాలస్తీనీయన్లు నివసించేందుకు గాజా బయట ఆరు ప్రాంతాలు ఉంటాయి” అని ట్రంప్‌ పేర్కొన్నారు. పాలస్తీనీయన్లు తిరిగి గాజాలో వచ్చేందుకు అవకాశం కల్పిస్తారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. అటువంటి అవకాశం లేదన్నారు. అక్కడ వారికి ఇంతకంటే మంచి గహ వసతులు ఉంటాయని చెప్పారు.
హమాస్‌ వెనకడుగు..
తదుపరి విడత బందీల విడుదల విషయంలో హమాస్‌ ఓ ప్రకటన చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయిల్‌ ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ.. తదుపరి బందీల విడుదల ప్రక్రియను ఆలస్యం చేస్తామని వెల్లడించింది. ఇజ్రాయిల్‌- హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఎంతమేర సజావుగా కొనసాగుతుందోననే అనుమానాలు నెలకొన్న వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది.తదుపరి విడుదల ప్రక్రియ శనివారానికి నిర్ణయించగా.. హమాస్‌ ఈ మేరకు ప్రకటన చేసింది.

Spread the love