భారత్‌లో టెస్లా కార్యకలపాలకు సిద్దం

– ఎలన్‌ మస్క్‌ వెల్లడి
వాషింగ్టన్‌ : విద్యుత్‌ వాహనాల తయారీ కంపెనీ టెస్లా భారత్‌లో ప్లాంట్‌ ఏర్పాటుపై ఎట్టకేలకు స్పష్టతనిచ్చింది. ఎప్పటి నుంచో ఊగిసలాటలో ఉన్న ఆ కంపెనీ అధినేత ఎలన్‌ మస్క్‌ అమెరికన్‌ మీడియాతో తప్పకుండా భారత్‌లో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఎక్కడ ఏర్పాటు చేసేది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఫ్యాక్టరీకి అనువైన పలు ప్రాంతాలను పరిశీలిస్తున్నామన్నారు. భారత్‌లో ప్లాంట్‌ నెలకొల్పే విషయంలో ఇప్పటికే టెస్లా ప్రతినిధులు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపారు. 2024 కార్ల ఉత్పత్తిని ప్రారంభించి.. 2025 నాటికి భారత్‌లో అమ్మకాలు చేయాలని ఆ కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి.

Spread the love