వాషింగ్టన్: అమెరికాలోని అలస్కా భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 7.4గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ క్రమంలోనే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అలస్కాకు సమీపంలో 9.3 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.