ఏడు అభియోగాలపై ట్రంప్‌కు అభిశంసన

న్యూయార్క్‌ : అమెరికా మాజీ అధ్యక్షుడు, డోనాల్డ్‌ ట్రంప్‌ను ఫ్లోరిడా ఫెడరల్‌ గ్రాండ్‌ జూరీ అభిశంసించింది. వచ్చే మంగళవారంనాడు అభి యోగాలపైన ఆయన సమాధానం నమోదు చేసేందుకు మియామీ కోర్టుకు ట్రంప్‌ హాజరు కావాల్సి వుంది. ఈ అభియోగాలన్నీ 2021 జనవరి లో తాను అధ్యక్ష భవనాన్ని వీడినప్పుడు తన తో తీసుకుపోయిన వేలాది అధికార పత్రా లకు, వందలాది వర్గీకరింపబడిన పత్రాలకు సంబంధించి నవి. అమెరికా నేషనల్‌ ఆర్కైవ్స్‌, రికార్డ్స్‌ అడ్మిని స్ట్రేషన్‌ తరపున డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టీస్‌ నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ట్రంప్‌ ఆ డాక్యుమెంట్లను స్వాధీనం చేయటా నికి నిరాకరించాడు.
మంగళవారందాకా ఈ అభియోగాలను బహిర్గతం చేయనప్పటికీ మీడియా వీటిని విపులం గా విశదీకరించింది. ఉద్దేశపూర్వకంగా డాక్యుమెం ట్లను తీసుకుపోవటం, తప్పుడు ప్రకటనలు చేయ టం, దేశ రక్షణకు సంబంధించిన సమాచారాన్ని సేక రించటం, ఇతరులకు పంపటం, పోగొట్టటం(ఇది 1917 గూఢచర్య చట్టం కిందకు వస్తుంది)వంటి అభియోగాలు ట్రంప్‌పై మోపబడ్డాయి. వీటికి సంబంధించిన వివరాలు మంగళవారం తరువాతే బహిర్గతమౌతాయి.
ఈ అభిశంసనను ఎన్నికల ప్రక్రియలో జోక్యంగా ట్రంప్‌ అభివర్ణించాడు. అంతేకాకుండా ఇది పాలక పార్టీ ప్రతిపక్షం లేకుండా చేసే అప్రజాస్వామిక చర్య తప్ప మరొకటి కాదని ఆయన అన్నాడు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టీస్‌, ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌లపైన విచారణ జరపటం కోసం కాంగ్రెస్‌లో పట్టుబట్టటానికి ”ప్రథమ ప్రాధమ్యం” ఇవ్వాలని రిపబ్లకన్‌ పార్టీ ప్రతినిధులను ఆయన కోరాడు. ఒక మాజీ అధ్యక్షుడు ఇటువంటి ఫెడరల్‌ అభియోగాలను ఎదుర్కోవటం అమెరికా చరిత్రలోనే మొట్టమొదటిసారి. డోనాల్డ్‌ ట్రంప్‌ పైన ప్రోసిక్యూటర్లు ఈ అభియోగాలను నిరూపించగలి గితే ఆయనకు దీర్ఘ కాల కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుంది. ట్రంప్‌ మాజీ అధ్యక్షుడే కాకుండా 2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరపున నిలుచునేందుకు పోటీపడే అభ్యర్థులలో అగ్రగణ్యుడుగా ఉన్నాడు.
అమెరికా పాలక వర్గాలలో రాజకీయ స్పర్థలు ఒక నూతన దశకు చేరుకోవటాన్ని ఈ అభిశం సనతోపాటు అనేక సంఘటనలు సూచిస్తున్నాయి. పదవిలోవున్న ఒక అధ్యక్షుడి మీద రష్యాతో అంటకాగుతున్నాడనే విషయం మీద ఒక ప్రత్యేక విచారణాధికారిచేత విచారణ జరిపించటం, అమెరికా కాంగ్రేస్‌ లోని ప్రతినిధుల సభ రెండుసార్లు అధ్యక్షుడిపైన అభిశంసన తీర్మానాలను ఆమోదిం చటం (ఇవి సెనేట్‌ లో వీగిపోయాయి),అధికారంలో కొనసాగటానికి రాజ్యాంగాన్ని కూలదోసేందుకు ట్రంప్‌ తిరుగుబాటు చేయటంవంటి ఘటనలు జరిగాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ను న్యాయ వ్యవస్థ ద్వారా కట్టిపడేసి, 2024 ఎన్నికల్లో ఆయనను అధికారంలోకి రాకుండా చేసేందుకు డెమోక్రాటిక్‌ పార్టీ, బైడెన్‌ పాలనాయంత్రాంగం, జాతీయ భద్రతా వ్యవస్థ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయనేది సుస్పష్టం.
2015లో ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైనప్పటి నుంచి ఆయనకు రష్యా వ్యతిరేకత లేకపోవటంపైన డెమోక్రటిక్‌ పార్టీ ట్రంప్‌ పైన దాడి చేస్తూ వుంది. డోనాల్డ్‌ ట్రంప్‌ తిరిగి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే రష్యా విషయంలో నమ్మదగనివాడుగాను, ఊహకు అందనివాడుగాను, ఉక్రెయిన్‌ లో జరుగుతున్న యుద్ధంలో జోక్యం చేసుకోగోరుతున్నవాడుగాను అమెరికా ద్రవ్య పెట్టుబడిదారీ వర్గంలోని బలమైన శక్తులు, జాతీయ భద్రతాయంత్రాంగం భావిస్తున్నాయి.
అయితే వాస్తవంలో ట్రంప్‌ యుద్ధాన్ని నిజాయితీగా వ్యతిరేకించేవాడు కాదు. అమెరికాలో తాను నిర్మించదలచిన ఫాసిస్టు ఉద్యమం కోసం యుద్ధంపట్ల ప్రజలకున్న వ్యతిరేకతను వాడుకోవ టానికి ట్రంప్‌ ఎల్లవేళలా ప్రయత్నిస్తుంటాడు.

Spread the love