అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాం : సౌదీ అరేబియా

రియాద్‌ : రష్యాతో కలిసి చమురు ఉత్పత్తిలో కోత విధించేందుకు సౌదీ అరేబియా అంగీకరిస్తే అందుకు తగిన పర్యవసానాలను ఎదుర్కోవలసి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరించిన నేపథ్యంలో సౌదీ రాజు స్పందించారు.
తాము తలచుకుంటే అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయగలమని సౌదీ రాకుమారుడు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ బెదిరించినట్టు వాషింగ్టన్‌ పోస్ట్‌ పేర్కొంది. అమెరికా ఆకాంక్షకు వ్యతిరేకంగా క్రూడ్‌ ఆయిల్‌ ఉత్పత్తిని సౌదీ అరేబియా తగ్గిస్తే సౌదీ రాజ్యంతో తమ సంబంధాలను పున్ణసమీక్షించుకోవలసి ఉంటుందని బైడెన్‌ ఇటీవల వ్యాఖ్యనించారు. ఒకవేళ సౌదీ అరేబియాకే గనుక అమెరికా నష్టం చేస్తే తను అమెరికాతో ఎటువంటి లావాదేవీలు జరపబోనని ఎమ్‌బిఎస్‌గా పిలువబడే మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అన్నాడు. అదే జరిగితే అమెరికాకు తీవ్ర ఆర్థిక పర్యవసానాలు ఉంటాయని ఆయన హెచ్చరించాడు. ఈ హెచ్చరిక ఒక వర్గీకరింపబడిన డాక్యుమెంట్‌లో వుంది. అయితే ఇది కమ్యూనికేషన్ల లీకేజీలో ఉన్నదా లేక అమెరికాకు పంపిన ప్రయివేటు మెస్సేజ్‌ అనే విషయంపట్ల స్పష్టత రాలేదు.

Spread the love