– హాజరైన ఎలాన్ మస్క్
వాషింగ్టన్: ట్రంప్ రెండో సారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ప్రపంచ అపర కుబేరుడు, డోజ్ బాధ్యతలు చూస్తున్న ఎలాన్ మస్క్ సైతం హాజరయ్యారు. మస్క్‌కు ఎలాంటి మంత్రిత్వ శాఖ లేదా నిర్ణయాలు తీసుకునే అధికారం లేకపోయినప్పటికీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రత్యేక ఉద్యోగి, అధ్యక్షుడికి సీనియర్ సలహాదారు హౌదాలో ఈ భేటీలో పాల్గొన్నట్టు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు.
డోజ్‌కు నేత ృత్వం వహిస్తున్న మస్క్.. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఫెడరల్ ఉద్యోగులకు హెచ్చరికలు సైతం జారీ చేశారు. ఉద్యోగులు తమ పనిపై వివరణ ఇవ్వాలని మెయిల్స్ పంపి గడువు విధించారు. మరోవైపు మస్క్ నిర్ణయాలను ట్రంప్ సైతం సమర్థిస్తున్నారు. అధికారులు మస్క్ మెయిల్‌కు వివరణ ఇవ్వకుంటే పాక్షికంగాగానీ, పూర్తిగాగానీ ఉద్యోగాల నుంచి తొలిగిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఫెడరల్ ఉద్యోగులను తొలగించే ప్రక్రియలో భాగస్వాములం కాలేమంటూ ఎలాన్ మస్క్ నేత ృత్వంలోని డోజ్‌లో పని చేస్తున్న 21 మంది సివిల్ సర్వీస్ ఉద్యోగులు మంగళవారం మూకుమ్మడిగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే.