ఉచిత విద్యుత్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

నవతెలంగాణ- గాంధారి
తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు గాంధారి మండల కేంద్రంలోని నెహ్రూ చౌరస్తా వద్ద పిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ బీఆర్ఎస్ దగ్ధంచేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు శంకర్ నాయక్, సొసైటీ చెర్మెన్ సాయికుమార్, గాంధారి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గాంధారి సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్, ఎంపిటిసి సభ్యులు పత్తి శ్రీనివాస్, ఏఏంసి వైస్ ఛైర్మన్ రెడ్డి రాజు, కో అప్షన్ మెంబర్ ముస్తఫా, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శివాజీ రావు, బిర్మల్ తండా సర్పంచ్ దర్బార్, మాధవ పల్లి సర్పంచ్ లక్ష్మీ మహిపల్ రావు, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love