నవతెలంగాణ కంఠేశ్వర్: లయన్ సహారా ఆధ్వర్యంలో బీ బీసీ పాఠశాల వర్ని రోడ్లో గల పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్, జామెంట్రీ బాక్స్, ఇంగ్లీష్ డిక్షనరీ లను బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్ సూర్య భగవాన్ మాట్లాడుతూ.. పరీక్షలు అంటే భయం లేకుండా విద్యార్థిని విద్యార్థులు రాయాలని పాఠ్యాంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. మార్కుల కోసం కాకుండా జ్ఞానాన్ని పెంచుకునే విధంగా ఉన్నత స్థానాలను ఎదిగే విధంగా మంచిగా చదువుకొని జ్ఞానాన్ని పెంచుకోవాలని కోరారు. లయన్స్ సేవలను రానున్న కాలంలో మరింత పెంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ నరసింహారావు, లయన్స్ ధనుంజయ రెడ్డి, లయన్స్ ప్రవీణ్ కుమార్, ప్రధానోపాధ్యాయురాలు అరుణ, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.