ఓవర్‌ లోడ్లతో పాడవుతున్న రోడ్లు

– కంకర రోడ్డు మీద పడడంతో రాత్రిపూట రోడ్డు ప్రమాదాలు
– పట్టించుకోని ఆయా శాఖల అధికారులు
నవతెలంగాణ-హవేలీ ఘనపూర్‌
మెదక్‌-బోధన్‌ ప్రధాన రహదారిపై నిత్యం ఓవర్‌లోడ్‌లతో టిప్పర్లు, భారీ వాహనాలు వెళుతుండడంతో రోడ్లు పాడవుతున్నాయి. రోడ్లు పాడవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిమితికి మించిన బరువును సరఫరా చేయడంతో మండలంలో ఉన్న ప్రధాన రహదారిలో గుంతలు ఏర్పడుతున్నాయని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. హవేలిఘనపూర్‌ మండలంలో మెదక్‌-బోధన్‌ ప్రధాన రహదారి నుంచి నిత్యం టిప్పర్లలో కంకరను తరలిస్తున్నారు. హవేలీ ఘనాపూర్‌ మండలంలో ఉన్న ప్రధాన రహదారి మెదక్‌- బోధన్‌ రహదారి గుండా ఎల్లారెడ్డి, గోపాల్‌ పేట్‌ వంటి ప్రాంతాలకు కంకర లోడు ఇష్టం వచ్చినంత బరువు వేసుకొని వెళ్లడంతో మండలంలో ఉన్న రోడ్డు ధ్వంసం అవుతుందని మండల ప్రజలు వాపోతు న్నారు. టిప్పర్లలో తరలించడంతో మండల పరిధిలో ఉన్న రాయిన్‌ చెర్వు, శాలి పేట్‌ గేటు వద్ద రోడ్డుపై గుంతలు ఏర్పడుతు న్నాయని తెలిపారు. ఈ గుంతల గుండా వాహనదారుల ప్రయాణికులు ప్రయాణిం చాలంటే నానా అవస్థలు పడుతున్నారు. ఓవర్‌ లోడ్‌తో వెళ్తున్న టిప్పర్‌పై ఆయా శాఖల అధికారులు తనిఖీలు నిర్వహిం చకపో వడం పట్ల ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
…….

Spread the love