వీణవంకలో జిపి కార్మికుల మానవహారం

నవతెలంగాణ-వీణవంక
గ్రామ పంచాయతీ కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న సమ్మె శుక్రవారం నాటికి 16 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా జిపి కార్మికులు మండల కేంద్రంలో మానవహారం నిర్వహించారు. అనంతరం సమ్మె శిబిరానికి చేరుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ..  గ్రామపంచాయతీ  కార్మికుల వేతనాల పెంపు, పర్మనెంట్ కోసం నేటికీ ఆరు రోజులు గడుస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం శోచనియం అన్నారు. వీణవంక మండల పరిధిలోని 26 గ్రామాల పంచాయతీ  కార్మికులు సంపూర్ణంగా సమ్మె చేస్తున్నట్లు చెప్పారు. పారిశుధ్యం పనులు పక్కకు పోయేస్తితికి ప్రభుత్వం తీసుకు వచ్చిందని వాపోయారు. కార్మికులు అనేక సంవత్సరాల తరబడి పోరాడుతున్నప్పటికీ న్యాయం చేయలేదని మండిపడ్డారు. ఈ సమ్మె డిమాండ్స్ పరిష్కరించాలని కోరారు. ఉద్యోగ భద్రత లేకుండా వేతనాలు ప్రతి నెల చెల్లించకుండా, రెండు మూడు నెలలు పెండింగ్ పెడుతూ ఒకపక్క మండల అధికారులు, గ్రామ సర్పంచులు, కార్యదర్శుల వేధింపులు ఎక్కువవుతున్నాయని జీతాలు ఇవ్వాలని అడిగిన కార్మికులను పనులను తొలగిస్తున్నారని, కార్మికుల ఉద్యోగ భద్రత, జీవో నెంబర్ 60 ప్రకారం 30 శాతం పిఆర్సి పేంపు అమలు చేయాలని, పీఎఫ్ ఇఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, ప్రమాదవశాస్తు మరణించిన కార్మికుల కుటుంబానికి రూ.5 లక్షలు ఇన్సూరెన్స్ సౌకర్యం, పిఎఫ్, ఈఎస్ఐ అందించాలని విజ్ఞప్తి చేశారు. మల్టీపర్పస్ 51 జీవోను సవరించి కేటగిర్ల వారిగానే పనులు కొనసాగించాలని, కారోబార్లను పంచాయతీ సహాయ కార్యదర్శి లుగా నియమించాలని తదితర డిమాండ్ల లో సాధన కోసం నిరవధిక సమ్మెలోకి వెల్లినట్లు వారు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్చలకు పిలిచి పరిష్కారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు మహంకాళి కొమురయ్య, కండే సదయ్య, దసారపు వెంకటేష్, కిషన్ రావు, గొడిసెల కొమురయ్య, దసారపు మల్లయ్య, శంకర్ వీరితోపాటు గ్రామాల కార్మికులు పాల్గొన్నారు.
Spread the love