- Advertisement -
నవతెలంగాణ – నకిరేకల్
భారతీయ కుటుంబ విలువలకు, అన్నాచెల్లెళ్ల అనురాగ బంధానికి ప్రతీక అయిన రక్షాబంధన వేడుకను మండలంలోని పాలెం ప్రాథమికోన్నత పాఠశాల లో విద్యార్థులు ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. సమాజంలోని ప్రతి ఆడపిల్లకు ఆమె గౌరవాన్ని కాపాడే భద్రతను కల్పించగలిగిన నాడే రాఖీ పౌర్ణమికి సార్ధకత అవుతుందని,ఆడపడుచుల మాన, ప్రాణ సంరక్షణ మాత్రమే కాకుండా ఆమె ఆకాంక్షలు,ఆశయాలు నెరవేరే దిశగా కృషి చేసేందుకు విద్యార్థులు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.
- Advertisement -