- Advertisement -
అఖిలేశ్ యాదవ్ మండిపాటు
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఓటరు జాబితాల తయారీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినప్పటికీ ఎన్నికల కమిషన్ వాటిని అరికట్టలేకపోయిందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. యూపీలో అధికార బీజేపీతో అధికారులు కుమ్మక్కయ్యారని, ఓట్లను లూటీ చేశారని మండిపడ్డారు. పార్లమెంట్ కాంప్లెక్స్‌లో సోమవారం అఖిలేశ్ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల అవకతవకలపై తమ పార్టీ పదే పదే ఫిర్యాదులు చేసినప్పటికీ కమిషన్ వాటిని పట్టించుకోలేదని ఆరోపించారు.
- Advertisement -