- Advertisement -
నవతెలంగాణ – తంగళ్లపల్లి
మండలంలోని సారంపల్లి ప్రభుత్వ పాఠశాలకు ఆ గ్రామ తాజా మాజీ సర్పంచ్ కొయ్యడ రమేష్ సౌండ్ సిస్టమ్ వితరణ చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ తన తాత మాజీ ఎంపీటీసీ స్వర్గీయ గుగ్గిళ్ళ ఎల్లయ్య జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాలకు సౌండ్ సిస్టమ్, అంప్లిఫైర్, మౌత్ అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎం సంగెం రాజేష్, నాయకులు గుగ్గిళ్ళ అంజయ్య, సిరిసిల్ల కిషన్, భూమేష్, రాజేశం, అమర్ రావు, మహేష్, సురేష్, సంతోష్, నరహరి, గణేష్, రమేష్, శ్రీనివాస్, పర్షరాములు, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -