Friday, June 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఖరీఫ్ సాగుకు రైతన్న సన్నదం

ఖరీఫ్ సాగుకు రైతన్న సన్నదం

- Advertisement -

ఆశించిన స్థాయిలో వర్షాలు పడని వైనం
నవతెలంగాణ-మద్నూర్
వర్షాకాలం మొదలైందని ఖరీఫ్ సాగుకు రైతన్న సన్నదమవుతున్నాడు. సోయా, పెసర, మినుముల సాగును ప్రారంభించారు. అయితే వర్షాలు పూర్తి స్థాయిలో పడడం లేదు. వ్యవసాయానికి సరిపడా వానలు కురవడం లేదు. దీంతో దిగాలుగా రైతన్న ఆకాశం వైపు చూస్తున్నాడు. మరోవైపు ప్రతిరోజూ కారుమబ్బులు కమ్ముకుంటున్నా.. వరుణుడు రైతన్నపై కాస్తంత జాలి కూడా చూపడం లేదు. వర్షాలు బాగా పడినప్పుడే పంటలు వేసుకోవాలని, లేనియెడల భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని మండల వ్యవసాయ అధికారులు రైతన్నలకు సూచిస్తున్నారు. అయినా ఇవేవీ పట్టనట్టు ఒకరిని చూసి మరొకరు రైతులు పొలాల్లో ముమ్మరంగా సాగు పనులు చేపడుతున్నారు. ఇప్పటికే మద్నూర్ మండల పరిధిలో 50 శాతం రైతులు పంట సాగు పనులు మొదలుపెట్టారు. వచ్చే రెండు మూడు రోజుల్లో వానలు పడకపోతే అన్నదాత సాగుకు పెట్టిన పెట్టుబడి కూడా రావడం కష్టమే అని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -