- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండల కేంద్రంలోని ఆటో యూనియన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు షబ్బీర్ ఆధ్వర్యంలో పంద్రాగస్టు జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ఆటో డ్రైవర్ యూనియన్ నాయకులు, సభ్యులు కలిసి ఈ పంద్రాగస్టు పండుగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి ఏటా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మిఠాయిలు పంచి పెట్టి పండుగ వేడుకల్లో పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు , నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామానికి చెందిన పెద్దలు, వివిధ కాంగ్రెస్ , బి ఆర్ ఎస్ , బిజెపి , పార్టీ నాయకులు , మండల ఆటో యూనియన్ నాయకులు గౌస్, రషీద్ , యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -