– సీపీఐ(ఎంఎల్) ప్రజా పంథా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో కురిసిన అతి వర్షాల వల్ల వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయనీ, కుటుంబాలు నష్టపోయాయనీ, ఆ బాధితులను తక్షణం ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సుమారు 2 లక్షల ఎకరాల్లో పంట ధ్వంసమయిందని తెలిపారు. ఇండ్లు కూలిపోవటంతో ప్రజలు కట్టు బట్టలతో మిగిలారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించి యుద్ధ ప్రాతిపదికన పునరావాస చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాజకీయ విన్యాసాలు వదిలి బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. నెల రోజులకు సరిపడా ఆహారపదార్థాలను అందించాలనీ, రూ. 25వేల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు.