- Advertisement -
నవతెలంగాణ ఆర్మూర్
10 రూపాయలకే ఒక షర్ట్.. ఆశ్చర్యంగా ఉంది కదా.. నమ్మసక్యం కావడం లేదా… పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్దగల ఒక కాంప్లెక్స్ లోని పంకీ బాయ్స్ బట్టల షాపు దుకాణదారులు 250 ధర గల షర్టు 10 రూపాయలకే అమ్ముతామని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దీంతో గురువారం యువకులు, మహిళలతో పాటు వృద్ధుల సైతం షర్టు కొనేందుకు ఎగబడ్డారు. స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్, పోలీస్ సిబ్బందితో వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు.
- Advertisement -