- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కేమ్రాజ్ కల్లాలి తాండా లో కేంద్రం నిర్వాహకురాలు టీచర్ రాధా ఆధ్వర్యంలో శ్రీమంతం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన శ్రీమంతం కార్యక్రమంలో తాండకు సంబంధించిన పేద గర్భవతులను ప్రత్యేకంగా ఆహ్వానించి వారికి సారే, గాజులు, పెట్టి వోడి బియ్యం పోసి శ్రీమంత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని గర్భవతులు, కౌమార బాలికలు, తల్లి పిల్లలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆటపాటలతో శ్రీమంతం కార్యక్రమం నిర్వహించి సన్మాన సత్కారం చేశారు.
- Advertisement -