– డాక్టర్ సంజయ్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఫార్మసీ, మెడికల్ షాపుల్లో అర్హత లేని వ్యక్తులు, నకిలీలు ప్రజలకు మందులిస్తే అత్యధికంగా రూ.ఐదు లక్షలకుపైగా జరిమానాతో పాటు మూడు నెలల జైలు శిక్ష పడుతుందని తెలంగాణ ఫార్మా సొసైటీ అధ్యక్షులు డాక్టర్ సంజరు రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు లోక్ సభ ఆమోదించిన జన్ విశ్వాస్ బిల్లు ఫార్మసీ చట్టం 1948లోని సెక్షన్ 42 ఉల్లంఘిస్తే మూడు నెలల జైలు శిక్ష, రూ.2 లక్షల వరకు జరిమానా విధించవచ్చని తెలిపారు. ఫార్మసీ యాక్ట్ 1948 ప్రకారం… ఫార్మసీల్లో ఫార్మసిస్టుల (ఔషద నిపుణుల) ద్వారా మాత్రమే నాణ్యమైన మందులను తీసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. జన్ విశ్వాస్ బిల్లు డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ చట్టంలోని 27డీ ప్రకారం… ఫార్మసీలు, మెడికల్ దుకాణాల్లో అర్హత లేని వ్యక్తులు, నకిలీలు ప్రజలకు మందులిస్తే రూ.ఐదు లక్షలు, అంతకన్నా ఎక్కువ జరిమానా విధిస్తారని హెచ్చరించారు.