- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం ధూపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా మాధవరెడ్డి శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆయనకు ఘనంగా శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలు బి వెంకటలక్ష్మి, పి ఆర్ టి యు మండల అధ్యక్షులు టి సోమలింగం గౌడ్, కృష్ణ, ప్రభాకర్, సాయన్న, రాజేశ్వర్, రాధా, సంధ్యా రాణి, పోశెట్టి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -