No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్ఆదివారం క్లాసులు బోధిస్తున్న శ్రీ చైతన్య స్కూల్

ఆదివారం క్లాసులు బోధిస్తున్న శ్రీ చైతన్య స్కూల్

- Advertisement -
  • – పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ విద్యాసాగర్
    – ఆందోళన నిర్వహించిన ఎస్ఎఫ్ఐ నాయకులు
    నవతెలంగాణ-మెదక్ డెస్క్ :
    విద్యార్థులకు ఆదివారం వచ్చిందంటే చాలు సెలవు వస్తుందని ఎగిరి గంతేస్తారు. ఒక్కరోజైనా ప్రశాంతంగా ఆటలు ఆడుకుంటామని విద్యార్థులు పీలవుతారు. అలాంటి సండే పూట క్లాస్ నిర్వహించి విద్యార్థులను పాఠశాలకు రప్పిస్తుంది. సంగారెడ్డిలోని శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం. సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లిలో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు ఆదివారం క్లాసులు బోదిస్తున్నారు. సెలవు రోజు పాఠాలు చెప్పడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం విద్యార్థులకు క్లాస్ లు చెడుతున్న విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు పాఠశాలకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. సండే పాఠాలు చెప్పడంపై ఫోన్ లో ఎంఈఓకు ఫిర్యాదు చేయగా సంగారెడ్డి ఎంఈఓ విద్యాసాగర్ పాఠశాలకు చేరుకుని పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల డీన్ మహేష్ ను వివరణ కోరగా గణేష్ మండపం ఏర్పాటు కోసం విద్యార్థులు వచ్చారని పొంతనలేని సమాదానాలు చెప్పారు. గత కొన్ని రోజులుగా వర్షాలు పడి క్లాస్ లు నడవకపోవడంతో ఆదివారం క్లాస్ లు నిర్వహిస్తున్నామని సమాదానం చెప్పారు. ఆందోళన నిర్వహిస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సెలవు ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని హెచ్చరించారు. సండే క్లాస్ లు నిర్వహిస్తే తనకు చెప్పాలని విద్యార్థులకు తన ఫోన్ నంబర్ ఇచ్చారు.
    శ్రీచైతన్య స్కూల్ కు మోమో జారీ చేస్తాం: సంగారెడ్డి ఎంఈఓ విద్యాసాగర్
    సండే క్లాస్ లు బోదిస్తున్న శ్రీ చైతన్య స్కూల్ కు మోమోలు జారీ చేస్తాం. ఆదివారం క్లాసులు నిర్వహించకూడదు. పాఠశాలను పరిశీలించగా నిజంగానే విద్యార్థులకు క్లాస్ రూముల్లో పాఠాలు బోధిస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపి చర్యలు తీసుకుంటాం.
    పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి: ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మహేష్
    ఆదివారం సెలవు రోజున శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులకు క్లాస్ లు భోదిస్తున్నది. సెలవు రోజు పాఠాలు చెబుతున్న పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. పాఠశాలలకు తప్పనిసరిగా సెలవు ఇవ్వాల్సిందే. సెలవు రోజుల్లో క్లాస్ లు నిర్వహిస్తే విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad