తెలంగాణ మార్కెట్లోకి ఎలక్ట్రానికా ఫైనాన్స్‌ 50 శాఖల ఏర్పాటు లక్ష్యం : సీఈఓ వెల్లడి

హైదరాబాద్‌ : పూణెకు చెందిన బ్యాంకింగేతర విత్త సంస్థ ఎలక్ట్రానికా ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఇఎఫ్‌ఎల్‌) తెలంగాణ మార్కెట్లోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. మంగళవారం హైదరాబాద్‌లో ఆ సంస్థ ఎండీ, సీఈఓ శిల్పా పోపాలే మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల వరంగల్‌, సూర్యపేటలో ఏడు శాఖలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో 50 శాఖలను తెరువాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకోసం రూ.10కోట్ల మేర పెట్టుబడులు అవసరం అవుతాయన్నారు. ప్రత్యక్షంగా 250 పైగా ఉద్యోగాలను కల్పించనున్నామన్నారు. దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 180పైగా శాఖలు ఉన్నాయన్నారు. వచ్చే ఐదేండ్లలో దేశ వ్యాప్తంగా 500 శాఖలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 2023 జూన్‌ ముగింపు నాటికి రూ.3,000 కోట్ల రుణ పుస్తకాన్ని సాధించామన్నారు. తాము ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారితో పాటు ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు సులభంగా రుణాలు అందిస్తామన్నారు. కనీస వడ్డీ రేటు 12 శాతం నుంచి ప్రారంభమవుతుందన్నారు.

Spread the love